ETV Bharat / state

కేంద్ర మంత్రికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

author img

By

Published : Sep 11, 2020, 9:12 AM IST

Updated : Sep 11, 2020, 10:06 AM IST

అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని మెగా ఎక్స్‌ప్రెస్‌ వేలో చేర్చాలని... ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడే ఈ మార్గాన్ని గ్రీన్​ఫీల్డ్​ హైవే త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.

mp srikrishna devarayalu writes letter to union minister nithin gadkari
కేంద్ర మంత్రికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని మెగా ఎక్స్‌ప్రెస్‌ వేలో చేర్చి... 23వ రహదారిగా అభివృద్ధి చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడే ఈ మార్గాన్ని త్వరగా పూర్తయ్యేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం... దేశ వ్యాప్తంగా రానున్న నాలుగైదేళ్లలో 3.3 లక్షల కోట్ల వ్యయంతో 8 వేల కి.మీ మేర రహదారులను అభివృద్ధి చేస్తోందని, ఈ మెగా ఎక్స్​ప్రెస్​ వే పనుల్లో హైదరాబాద్ - విశాఖపట్నం, నాగపూర్ - విజయవాడ ఎక్స్​ప్రెస్​ మార్గాలను చేర్చటం పట్ల కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:

రేపే... స్వయం సహాయక మహిళల ఖాతాల్లోకి 6, 792 కోట్లు: బొత్స

Last Updated : Sep 11, 2020, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.