ETV Bharat / state

MP Galla Appreciate Kidambi: షట్లర్ శ్రీకాంత్​ను అభినందించిన.. ఎంపీ గల్లా జయదేవ్

author img

By

Published : Dec 30, 2021, 8:20 PM IST

MP Galla Appreciate Kidambi: వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం గెలుచుకున్న శ్రీకాంత్​ను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభినందించారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా శ్రీకాంత్ ఎదిగారని జయదేవ్ ప్రశంసించారు.

MP Galla Appreciate Kidambi: ఇటీవల స్పెయిన్​లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం గెలుచుకున్న కిడాంబి శ్రీకాంత్​ను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభినందించారు. గుంటూరులోని శ్రీకాంత్ నివాసానికి వెళ్లిన జయదేవ్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా శ్రీకాంత్ ఎదిగారని జయదేవ్ ప్రశంసించారు.

తొలి భారత క్రీడాకారుడు..
Silver in BWF World Badminton Championship: కిదాంబి శ్రీకాంత్‌.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్​లో తళుక్కుమన్నాడు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పురుషుల విభాగం ఫైనల్‌లో సింగపూర్‌ క్రీడాకారుడు కియాన్ యో చేతిలో ఓడినప్పటికీ... రజత పతకం సాధించి ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు. మహిళల విభాగంలో ఇప్పటికే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.

ఆటలో ఆరితేరాడు..
గుంటూరులో 2001లో షటిల్ పట్టిన శ్రీకాంత్.. పలుచోట్ల శిక్షణ పొంది ఆరితేరాడు. ఆసియా, ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ప్రతిభ చూపాడు. హైదరాబాద్​లోని గోపీచంద్‌ అకాడమీలో చేరాక.. శ్రీకాంత్ తన ఆటలో మరింత రాటుదేలాడు. షటిల్ బ్యాడ్మింటన్​లో కీలకమైన సూపర్ సిరీస్ ప్రీమియం టైటిళ్లు, సూపర్ సిరీస్ టైటిళ్లు చెరో మూడు చొప్పున గెలుపొందాడు. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియం టైటిల్‌, 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచాడు. 2017లో శ్రీకాంత్ భీకర ఫామ్‌తో చెలరేగిపోయాడు. ఇండోనేషియా ఓపెన్ ప్రీమియం టైటిల్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్, డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ టైటిల్ గెలుపొందాడు. అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సత్తా చాటాడు. ఇప్పటివరకు 3 గ్రాండ్ ప్రిక్స్ టోర్నీల్లో గెలుపొందాడు. 2018లో గోల్డ్ కోస్టులో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్ విభాగంలో వెండి పతకం గెల్చుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఫైనల్‌కి చేరడం ద్వారా శ్రీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

ఇదీ చదవండి :

Star Shelter Kidambi srikanth: కొత్త చరిత్ర సృష్టించిన స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌.. గుంటూరులోని నివాసం వద్ద సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.