ETV Bharat / state

'అమరారెడ్డి నగర్ ప్రజలకు త్వరలోనే గృహాల నిర్మాణ పనుల ప్రారంభం'

author img

By

Published : May 31, 2021, 1:20 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో... అమరారెడ్డి నగర్​ వాసులకు కేటాయించిన ఇళ్ల స్థలాన్ని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే గృహ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

house plots
ఇళ్ల స్థలాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న అమరారెడ్డి నగర్​ వాసులకు.. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాన్ని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పరిశీలించారు. రహదారుల విస్తరణ నిమిత్తం… అమరారెడ్డి నగర్​లో నివాసముంటున్న సుమారు 300 కుటుంబాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు.

వారికి ఆత్మకూరులో నివాస స్థలాలు కేటాయించారు. అక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

CM Jagan: 'పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే మా లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.