ETV Bharat / state

ప్రేమ వేధింపులు: ఆత్మహత్యకు యత్నించిన బాలిక మృతి

author img

By

Published : Jun 29, 2021, 10:54 PM IST

ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన జరిగింది.

minor girl died
బాలిక మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది. తాడేపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను క్రిస్టియన్ పేటకు చెందిన మహేంద్ర కుమార్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. ఈ కారణంగా ఈ నెల 14న బాలిక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఈ నెల 17వ తేదీన మహేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యం విషమించడంతో నేడు మరణించింది.

ఇదీ చదవండీ.. CM Letter To PM: 'ప్రైవేటు ఆస్పత్రులు వాడని కొవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వం సేకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.