ETV Bharat / state

రెడ్దిగూడెం వద్ద కారును ఢీకొన్న లారీ.. ఆరుగురికి గాయాలు

author img

By

Published : Jun 19, 2020, 7:30 PM IST

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్దిగూడెం వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Lorry collides with a car at Reddigudem
రెడ్దిగూడెంలో రోడ్డు ప్రమాదం

విజయవాడకు చెందిన వారు పిడుగురాళ్లలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. గుంటూరు జిల్లాలో రాజుపాలెం మండలం రెడ్దిగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా... రెండేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి. తెలంగాణ: వాహనంలోనే స్వర్గపురి వాహనం డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.