ETV Bharat / state

లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా.. విశాఖలో మూలాలు

author img

By

Published : Jul 20, 2020, 6:02 PM IST

Liquid marijuana smuggling at guntur district
లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా

పోలీసుల కంటపడకుండా గంజాయి రవాణా చేసేందుకు అక్రమార్కులు కొత్తదారులను వెతుకుతున్నారు. ముడి సరకును తరలించడం, దాచడం కష్టమవుతుండటంతో..... కొత్త పంథాను ఎంచుకున్నారు. ద్రవ రూప గంజాయిని చిన్న చిన్న బాటిళ్లలో విక్రయిస్తూ.... డబ్బులు దండుకుంటున్నారు.

లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా

పోలీసులు వరుస దాడులు చేసి స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నా.... అక్రమార్కులు కొత్త కొత్త మార్గాలను ఆన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా.. గుంటూరులో ఆరుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నప్పుడు 7 కిలోల సాధారణ గంజాయితో పాటు 20 గ్రాముల బరువున్న 130 చిన్న చిన్న బాటిళ్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కొత్త టెక్నిక్..

ఇన్ని సమస్యల నేపథ్యంలో గంజాయి తరలింపు ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో గంజాయి రవాణాదారులు కొత్త టెక్నిక్ ను కనిపెట్టారు. అదే జెల్లీ రూపంలో ఉన్న లిక్విడ్ గంజాయి. గంజాయితోపాటు పెట్రోలియం ఉత్పత్తి అయిన వైట్ ఆయిల్ కలిపి కుక్కర్ లో ఉడికిస్తున్నారు. తర్వాత కొద్దిపాటి రసాయనాలను కలిపి లిక్విడ్ గంజాయిని తయారు చేస్తున్నారు.

చరస్ గా పిల్చుకునే లిక్విడ్ గంజాయిని పీల్చడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యువతే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ దందాకు విశాఖ జిల్లాలోనే గంజాయి మూలాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువగా విక్రయాలు సాగుతున్నాయని తేల్చారు.

విద్యార్థులే లక్ష్యంగా..

కళాశాల విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకున్న అక్రమ రవాణాదార్లు... సులభంగా లక్షలు వెనుకేసుకుంటున్నారు. ఈ విషయంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, లిక్విడ్ గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

ఈనెల 24 వరకూ కోటప్పకొండ ఆలయం మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.