ETV Bharat / state

జనసైనికులకు గుడ్​న్యూస్​..ఆ తేదీ వరకూ నమోదు ప్రక్రియ గడువు పొడిగింపు

author img

By

Published : Mar 1, 2023, 12:20 PM IST

Updated : Mar 1, 2023, 1:01 PM IST

JANASENA MEMBERSHIP EXTENDED : మూడో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియకు మంచి స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభ్యత్వ నమోదు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు.

JANASENA MEMBERSHIP EXTENDED
JANASENA MEMBERSHIP EXTENDED

జనసైనికులకు గుడ్​న్యూస్​.. మార్చి 3వ తేదీ వరకూ ఆ నమోదు ప్రక్రియ గడువు పొడిగింపు

JANASENA MEMBERSHIP EXTENDED : జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సభ్యత్వ నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినందున కొందరు తమ పేర్లను నమోదు చేయించుకోలేకపోయారన్నారు. అందుకే గడువు పెంచాలని జన సైనికులు, వీర మహిళల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు మనోహర్ తెలిపారు. సభ్యత్వ నమోదు గడువును మార్చి 3వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు పెంచాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

జనసేన క్రీయాశీలక సభ్యత నమోదు కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని నాదెండ్ల మనోహర్​ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఘనంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీకి చెందిన నాయకులు, క్షేత్రస్థాయిలో జనసైనికులు.. అధినేత పవన్​ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు వివరించారు. అలాగే సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పార్టీ తరఫున, పవన్​ కల్యాణ్​ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు.

"జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. కొన్ని అంశాలపైనా చాలా మంది మాకు ఫోన్​ చేసి.. సాంకేతిక కారణాల వల్ల గత రెండు రోజుల నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. ఈ అంశాలను పరిశీలించిన పవన్​ కల్యాణ్​ మార్చి 3వ వరకూ గడవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు"-నాదెండ్ల మనోహర్​, జనసేన పీఏసీ ఛైర్మన్​

అయితే జనసేన సభ్యత నమోదుపై వచ్చిన కొన్ని అంశాలను పరిశీలించి పవన్​ ఓ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు అంటే మార్చి 3వ తేదీ సాయంత్రం 7 గంటల వరకూ సభ్యత నమోదు గడువును పొడిగుస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజల భవిష్యత్తు, భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం నమోదు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Janasena Party Membership: జనసేన క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం గత నెల 10వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమం ప్రారంభం కానున్న సందర్భంలో జనసైనికులకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. గత రెండు విడతలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన 6వేల 400 మంది వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదే ఉత్సాహంతో మూడో విడత సభ్యత్వ నమోదుని కూడా జయప్రదం చేయాలన్నారు. జనసేన పార్టీ సభ్యుల ప్రమాద బీమా నిమిత్తం పవన్ కల్యాణ్ గతంలో 2కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈసారి కూడా తన విరాళాన్ని మార్చి 10వ తేదీన ప్రకటిస్తానన్నారు. అయితే సభ్యత నమోదు గడువును పెంచిన నేపథ్యంలో విరాళాం ఇచ్చే తేదీలో ఏమైనా మార్పు జరగనుందేమో అని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 1, 2023, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.