ETV Bharat / state

Inspections: పురుగుమందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో వ్యవసాయ అధికారుల తనిఖీలు

author img

By

Published : Jul 3, 2021, 8:34 PM IST

గుంటూరు జిల్లాలో పురుగుల మందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో.. వ్యవసాయశాఖ అధికారులు తనీఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. స్టాక్ రిపోర్టు, అమ్మకాల రికార్డులు సరిగా లేనట్లు గుర్తించారు. రెండ్రోజుల పాటు తనిఖీలు నిర్వహించనున్నారు.

Inspections by agricultural officials on stock points of pesticide companies in guntur
పురుగుమందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో వ్యవసాయ అధికారుల తనిఖీలు

గుంటూరు జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండ్రోజుల పాటు పురుగుమందుల కంపెనీల స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేయగా.. స్టాక్ రిపోర్టు, అమ్మకాల రికార్డులు సరిగా లేనట్లు గుర్తించారు. నాగార్జున అగ్రి కెమికల్స్‌ను సీజ్ చేసిన అధికారులు.. కాలం చెల్లిన పురుగు మందులు నిల్వ ఉంచారంటూ కేసు నమోదు చేశారు. 13 కంపెనీలకు సంబంధించి రూ.135.52 కోట్ల మేర అమ్మకాలు నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

TTD: కొత్త ఏజెన్సీకి చెల్లింపులు రూ.56 లక్షలు తక్కువే: ఈవో

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.