ETV Bharat / state

రాజధాని అమరావతికి అనుకూలంగా కొనసాగుతున్న నిరసనలు

author img

By

Published : Feb 6, 2020, 7:19 PM IST

రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.దీక్ష శిబిరాలను మాజీ మంత్రులు పుల్లారావు ,అనంద్ బాబు సందర్శించారు.

Former ministers who initiated initiation at the Collectorate's office
రాజధాని అమరావతికి అనుకూలంగా కొనసాగుతున్న నిరసనలు

రాజధాని అమరావతికి అనుకూలంగా కొనసాగుతున్న నిరసనలు

వైకాపా అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని మాజీమంత్రులు పుల్లారావు, ఆనంద్ బాబు మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద రిలే దీక్ష శిబిరాలను వారు సందర్శించారు. కియా అనుబంధ సంస్థలు ఇప్పటికి వేరే ప్రాంతాలకు తరలిపోయాయని ఇప్పుడు కియా పరిశ్రమ తరలి వెళ్తుందని మీడియా చెబుతుందన్నారు. పరిశ్రమ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోయినా ఫర్వాలేదు కానీ... నిర్మించిన పరిశ్రమలు తరిలిపోతే అది రాష్ట్రానికి తీరని నష్టమన్నారు. మూడు రాజధానులు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించటం సరికాదన్నారు. ఉద్యమం ప్రారంభమై యాభై రోజులు దాటిందని, మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ తిరిగి వెళ్లిపోతున్నాయి'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.