ETV Bharat / state

ప్లీజ్... మా నాన్నను కాపాడండి: మహిళా వాలంటీర్ అభ్యర్థన

author img

By

Published : Sep 4, 2020, 10:55 PM IST

ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతున్న తన తండ్రిని బతికించుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలంటూ... ఓ మహిళా వాలంటీర్ వేడుకుంటోంది. దాతలు సహాయం అందించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో విడుదల చేసింది.

female-volunteer-begs-to-be-saved-by-her-father-is-being-treated-with-corona
ఆర్థిక సహాయం చేయాలంటూ... ఓ మహిళా వాలంటీర్ వేడుకోలు

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన గుత్తి నాగదివ్య వాలంటీర్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు ప్రతి రోజు యాభై వేల రూపాయలు ఖర్చవుతోంది.

ఆ మొత్తాన్ని తాము భరించలేమని, దాతలు సహాయం అందించాలని కోరుతూ... కన్నీళ్లు పెట్టుకుంటూ నాగదివ్య వీడియో విడుదల చేసింది. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు గూగుల్ పే నంబర్ 7036712278 కు డబ్బులు పంపించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి:

నూతన్​నాయుడు అరెస్టు.. అట్రాసిటీ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.