ETV Bharat / state

Pathipati Pullarao: 'ప్రభుత్వం కావాలనే పింఛన్లు తొలగిస్తోంది'

author img

By

Published : Sep 4, 2021, 3:59 PM IST

అర్హత ఉన్నా.. ప్రభుత్వం కావాలనే పింఛన్లు తొలగిస్తుందని.. తెదేపా నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన వారికి తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.250 చొప్పున సామాజిక పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చి.. ప్రస్తుతం అర్హత ఉన్నవారిని సైతం తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ex minister pathipati pullarao fires on ycp over pensions
ప్రభుత్వం కావాలనే పింఛన్లు తొలగిస్తుంది: పత్తిపాటి పుల్లారావు

ప్రభుత్వం దురాలోచనతోనే అర్హత ఉన్నా పింఛన్(pension) తొలగిస్తుందని.. తెదేపా నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు(ex minister pathipati pullarao) విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.250 చొప్పున సామాజిక పింఛన్ పెంచుతానని హామీ ఇచ్చి.. ప్రస్తుతం అర్హత ఉన్నవారిని సైతం తొలగిస్తున్నారని మండిపడ్డారు.

తెదేపా అండగా ఉంటుంది

రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన వారికి తెదేపా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారి హక్కులను కాలరాస్తూ.. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. వైకాపా నాయకులు సమావేశాలు, సభలు పెట్టినా కేసులు ఉండవని.. ఇతర పార్టీ వారు సభలు పెడితే పోలీసులు కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో పరిపాలన పరిస్థితికి అద్దం పడుతుంది అన్నారు.

ప్రజలను మోసం చేశారు

సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న సీఎం జగన్.. ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. చట్టాన్ని ఉల్లంఘించి వారి ప్రతిష్టను తగ్గించుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. న్యాయస్థానం ఆదేశించినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు భయపడి అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ బిల్లులు చెల్లించడం లేదని ఆరోపణలు చేశారు. కొన్నిచోట్ల 30 శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులు చెల్లించాలని అధికారులపై.. వైకాపా ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. బిల్లులు చెల్లించని అధికారులపై గ్రామాల వారీగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

IAS TRANSFERS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.