ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

author img

By

Published : Mar 25, 2021, 3:30 PM IST

స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని శీతల పానీయాల లోడ్​తో వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

engineering student death in a road accident at bapatla guntur district
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని శీతల పానీయాల లోడ్​తో వస్తున్న వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మేరీ గ్రేస్ జూలియ మృతి చెందింది.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి విద్యార్థులు.. ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటీకీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇదీచదవండి.

ఇసుక దోపిడిని అరికట్టేందుకే నూతన విధానం: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.