ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

author img

By

Published : Dec 31, 2022, 11:03 PM IST

Updated : Jan 1, 2023, 6:46 AM IST

Celebrities who have wished for the New Year: కొత్త లక్ష్యాలు, ఉన్నత ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తూ ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి.. సరికొత్త ఆశలతో ముందుకు సాగాలని గవర్నర్‌, సీఎం, తెలుగుదేశం అధినేత సహా పలువురు ఆకాంక్షించారు.

wishesf
wishesf

Celebrities who have wished for the New Year: నూతన సంవత్సరం.. శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలను అందించాలని గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూడడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, నూతన లక్ష్యాలను సాధించడానికి కొత్త ఏడాది ప్రేరణనిస్తుందని ఆకాంక్షించారు.

2023 సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభాలు కలిగించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. భవిష్యత్తులోనూ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాలనే తపనతో, అభివృద్ధి అజెండా లక్ష్యంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకునే దిశగా నూతన ఆకాంక్షను ప్రజలకు అందిద్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో కూడిన మార్పును అందుకుందామన్నారు.

కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతో 2023కి స్వాగతం పలుకుదామంటూ తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు నూత‌న సంవ‌త్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కొత్త సంవ‌త్సరంలో ప్రజలందరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాల‌ని దేవుడ్ని ప్రార్థిస్తునన్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. 2023లో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు.

రాష్ట్ర ప్రజలకు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు నడిచినప్పుడే భవిష్యత్తు ఉంటుందని.. రేపటి రోజు మనదే అనే ఆశాభావంతో ప్రజలంతా ముందగుడు వేయాలన్నారు. ఈ సంవత్సరం ప్రజలకు మరిన్ని సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2023, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.