ETV Bharat / state

జాతర ముసుగులో కోడ్​ ఉల్లంఘన.. పట్టని అధికారులు

author img

By

Published : Mar 11, 2020, 2:18 PM IST

బాపట్లలోని తిరుపతమ్మ తిరునాళ్ళలో వైకాపా జెండా రంగులతో విద్యుత్ ప్రభలకు తోరణాలు కట్టారు. దీంతో జాతర ముసుగులో స్థానిక నేతలు ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించినా.. అధికారులు పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Election code Violation at bapatla
బాపట్లలో జాతర ముసుగులో కోడ్​ ఉల్లంఘన

బాపట్లలో జాతర ముసుగులో కోడ్​ ఉల్లంఘన

గుంటూరు జిల్లా బాపట్లలోని మున్నాంవారి పాలెంలో ఎన్నికల కోడ్​ను అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత రాత్రి గ్రామంలో తిరుపతమ్మ తిరునాళ్ళు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నేతలు భారీ ఎత్తున రెండు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. వాటికి పార్టీ రంగులతో కూడిన తోరణాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నేతలు యువతులుతో పాటలకు చిందులు వేయించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల నిబంధన ఏ ఒక్క అధికారికి గుర్తుకు రాలేదని స్థానికులు వాపోతున్నారు. తోపులాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారే తప్ప.. ఎన్నికల కోడ్​ ఉల్లంఘనపై చర్యలు తీసుకోలేదంటున్నారు.

ఇవీ చూడండి...

'అధికార పార్టీ అభ్యర్థులైతే నిబంధనలు వర్తించవా..?'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.