ETV Bharat / state

ఎన్టీఆర్ వర్సిటీ అకడమిక్ సెనేట్ సభ్యునిగా.. యార్లగడ్డ సుబ్బారావు

author img

By

Published : Dec 24, 2021, 10:13 PM IST

చెవి, ముక్కు, గొంతు, తల, మెడ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారావు.. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అకడమిక్ సెనేట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కాక్లియార్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు అన్ని ప్రాంతాల వ్యాప్తికీ నిర్విరామంగా ఆయన కృషి చేశారు.

Dr. Yarlagadda subba rao elected as Academic Senate member of  NTR Medical University
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అకడమిక్ సెనేట్ సభ్యునిగా.. డా.యార్లగడ్డ సుబ్బారావు

చెవి, ముక్కు, గొంతు, తల, మెడ శస్త్ర చికిత్స నిపుణులు, ఎన్. ఆర్.ఐ వైద్య కళాశాలలో ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్ యార్లగడ్డ సుబ్బారావు.. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అకడమిక్ సెనేట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. సుబ్బారావు.. రాష్ట్రంలో కాక్లియార్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు అన్ని ప్రాంతాల వ్యాప్తికీ నిర్విరామంగా కృషి చేశారు.

అత్యంత ఖరీదైన కాక్లియర్ ఆపరేషన్లు.. అన్ని ప్రాంతాలలో జరిగేందుకు సహాయ సహకారాలు అందించడంతోపాటు.. మొత్తం 18 ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు అనుమతులు లభించేలా కృషి చేశారు.

రాష్ట్రంలో మొదటి కాక్లియర్ ఇంప్లాంట్ మెంటర్ సర్జన్ గా అందరికీ శస్త్ర చికిత్సలో తర్ఫీదు ఇస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అకడమిక్ సెనేట్ సభ్యునిగా ఎన్నికవ్వటం పట్ల.. ముఖ్యమంత్రికి సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:

Ayush On Omicron: ఆ మందుకు అనుమతి లేదు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఆయుష్‌శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.