ETV Bharat / state

పోలీసుల అనుమతి లేకుండా నాయకులు పర్యటనకు వెళ్లాల్సిన పనేంటి?: డీజీపీ

author img

By

Published : Dec 28, 2022, 4:34 PM IST

DGP ON CRIME RATE IN AP : ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అనే పదమే.. పోలీసులకు సవాల్ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలు ప్రేరేపించే వాళ్లదే తప్పని ఆయన అన్నారు. పోలీస్‌ అనుమతి లేకుండా నాయకులు పర్యటనకు వెళ్లాల్సిన పనేంటని నిలదీశారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందని చెప్పుకొచ్చారు.

DGP ON CRIME RATE
DGP ON CRIME RATE

DGP ON CRIME RATE : రాజకీయ నాయకులు సున్నితమైన ప్రాంతాలకు వెళ్లేముందు పోలీసుల అనుమతి తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్​ రెడ్డి తెలిపారు. ఉద్రిక్తతలు ప్రేరేపించే వాళ్లదే తప్పని ఆయన అన్నారు. పోలీస్‌ అనుమతి లేకుండా వెళ్లాల్సిన పనేంటని నిలదీశారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందని వెల్లడించారు. లోక్​అదాలత్​లో 57 వేల కేసులను పరిష్కరించామన్నారు. శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీపరంగా మార్పులు చేశామని స్పష్టం చేశారు. 66.2 శాతం కన్విక్షన్ ఈ ఏడాది ఉందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు, హత్య కేసులో 44 మందికి శిక్ష పడిందని.. 88.5 శాతం కేసుల్లో ఛార్జిషీట్లు వేశామని పేర్కొన్నారు.

ఏపీలో గంజాయి సాగుని ఆపటానికి చర్యలు తీసుకున్నామన్న డీజీపీ.. 2.45 లక్షల కేజీల గంజాయి సాగుని దహనం చేసినట్లు వెల్లడించారు. వేరే రాష్ట్రాల్లో కూడా గంజాయి సాగు అడ్డుకోవాల్సి ఉందని సూచించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా గంజాయి సాగును దహనం చేశామని.. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సబ్సిడీపై అందించామన్నారు. శాటిలైట్ ఫొటోస్ ద్వారా ఇంకా ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందేమో చూసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దిశ యాప్​ ద్వారా వచ్చిన 25 వేల ఫిర్యాదుల్లో 1500 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశామన్నారు. వీక్లీ ఆఫ్ కొంత మంది పోలీసులకు ఇస్తున్నామన్న ఆయన.. 4 వీక్ ఆఫ్స్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నాటు సారా కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని.. 100 గ్రామాల్లో తయారీ అడ్డుకున్నామని వెల్లడించారు. సైబర్ నేరాల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఆన్​లైన్​లో జాబ్, లోన్ పేరుతో మోసాలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా తిట్టుకోవడం లాంటి కేసులు పెరిగాయని తెలిపారు.

పోలీసుల అనుమతి లేకుండా నాయకులు పర్యటనకు వెళ్లాల్సిన పని ఏంటి

"రాజకీయ నాయకులు సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. ముందస్తు అనుమతి లేకుండా పర్యటనకు వెళ్లకూడదు. ఉద్రిక్తతలు ప్రేరేపించే వాళ్లదే తప్పు.పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గింది. మహిళలపై అత్యాచారాలు, హత్య కేసులో 44 మందికి శిక్ష పడింది. 88.5 శాతం కేసుల్లో ఛార్జిషీట్లు వేశాం"-రాజేంద్రనాథ్​ రెడ్డి, డీజీపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.