Delhi Liquor scam updates: దిల్లీ మద్యం కుంభకోణం విచారణపై.. మీడియాలో వస్తున్న వార్తలపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు సమాచారం మీడియాకు వెళ్లటంపై.. ఆప్ మీడియా కోఆర్డినేటర్ విజయ్ నాయర్ వేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపింది. దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా లీకులు ఇస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వార్త ఛానళ్లు చేసిన రిపోర్టింగ్‌పై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈడీ, సీబీఐ అధికారిక ప్రకటనలనే వార్తలుగా ఇవ్వాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తు గురించి ఇప్పటివరకు పత్రికా ప్రకటన ఇవ్వలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. సీబీఐ మాత్రం మూడు పత్రికా ప్రకటనలు జారీ చేసిందని పేర్కొంది. విజయ్‌నాయర్‌పై మీడియా కథనాలు తమ ప్రకటన ప్రకారం లేవని సీబీఐ వివరించింది. సీబీఐ పత్రికా ప్రకటనకు, మీడియా కథనాలకు సంబంధం లేదని హైకోర్టు వెల్లడించింది.
మరోవైపు దిల్లీ మద్యం స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. మనీలాండరింగ్ అంశంలో శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు 14 రోజుల కస్టడీనిచ్చింది ధర్మాసనం. ఈడీ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. జైలులో బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డిలకు ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. బీపీ మందులు, చలి దుస్తులు, బూట్లు వాడేందుకు కోర్టు అనుమతినివ్వగా... జైలులో ఇద్దరికీ చికిత్స అందించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇక తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది.
ఇవీ చదవండి: