ETV Bharat / state

'మద్యం దుకాణాలు సరే.. మరి బుక్​ షాపుల మాటేంటి..?'

author img

By

Published : May 5, 2020, 7:50 PM IST

Updated : May 5, 2020, 8:02 PM IST

కేంద్రం మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతివ్వలేదని.. పుస్తకాల షాపులు కూడా తెరవమని చెప్పిందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు మాత్రమే తెరిచిందని ఎద్దేవా చేశారు. ఖజానా నింపుకోవడానికి ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతోందని ధ్వజమెత్తారు.

cpi ramakrishna talks about wine shops in state
వైకాపా ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విమర్శలు

లాక్​డౌన్ వేళ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం కోసం కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం దారుణమని విమర్శించారు. పుస్తకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతించని పోలీసులు.. మద్యం షాపులు ఎలా తెరవనిచ్చారని ప్రశ్నించారు.

8 గంటలా..!

నిత్యావసరాల కొనుగోలుకు 3 గంటలిచ్చి.. మద్యం కోసం 8 గంటలు సమయం ఇవ్వటం ఏ మేరకు సబబన్నారు. లాక్​డౌన్ కారణంగా రంజాన్ మాసంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకోవడం లేదని.. అలాంటిది మద్యం దుకాణాల వద్దకు మాత్రం వేలాది మందిని ఎలా అనుమతిస్తారని ధ్వజమెత్తారు. ధరలు పెంచింది పేదల్ని దోచుకోవటానికేనని.. మద్యానికి దూరం చేయటానికి కాదని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..

'కరోనా వ్యాప్తికి వైకాపా ప్రభుత్వం గేట్లు తెరిచింది'

Last Updated : May 5, 2020, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.