ETV Bharat / state

వెలుగు ఉద్యోగుల్లో మళ్లీ కలవరం.. ఆ కాస్త వెలుగు ఆర్పేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధం

author img

By

Published : Nov 14, 2022, 6:43 AM IST

Updated : Nov 14, 2022, 9:17 AM IST

Confusion among AP State Velugu employees: వెలుగు ఉద్యోగులు అరకొర వేతనాలతో ఎలా బతుకుతారని.. ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా జగన్ అప్పటి ప్రభుత్వంపై మండిపడ్డారు. నేను వస్తాను, నేను ఆదుకుంటానని హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే వేతనం 10 వేలుకు పెంచుతున్నామని చెప్పి.. 8 వేలు ఇస్తున్నారు. పెరిగిన ధరలతో.. చాలీచాలని జీతంతో జీవితం నెట్టుకొస్తున్నవారిలో.. ఉన్న కాస్త వెలుగు ఆర్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాలపరిమితి నిబంధన తీసుకువచ్చి ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేశారని వెలుగు యానిమేటర్స్‌ వాపోతున్నారు.

velugu employes
వెలుగు ఉద్యోగులు

వెలుగు ఉద్యోగులు

Confusion among AP State Velugu employees: 5 వేల గౌరవ వేతనంతో ఎలా బతుకుతారు..? నేను సీఎం అయితే 10 వేలు ఇవ్వడమే కాకుండా.. అన్నివిధాల ఆదుకుంటానని ప్రతిపక్షనేతగా జగన్ వెలుగు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నెలకు 10 వేల రూపాయల వేతన జీవో ఇవ్వడంతో.. అంతా సంతోష పడ్డారు. తీరా 10 వేలకు బదులు 8 వేలు రూపాయలే చెల్లిస్తున్నా.. నోరు మెదపకుండా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. 2019 డిసెంబర్‌లో మూడేళ్ల కాలపరిమితి నిబంధనతో ఉద్యోగులకు జగన్ సర్కార్‌ ఊహించని షాక్ ఇచ్చింది. యానిమేటర్స్‌ ఒక్కసారిగా రోడ్డెక్కి నిరసన తెలపడంతో మరో మూడేళ్లు కొనసాగే అవకాశం కల్పించింది.

ప్రభుత్వం పొడిగించిన మూడేళ్ల గడువు ఈ నవంబర్‌తో ముగుస్తుండటంతో.... ఉద్యోగుల్లో మళ్లీ కలవరం మెదలైంది. అధికారులు సైతం వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 వేల మంది వెలుగు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో ఏ శాఖకు లేని కాలపరిమితి వెలుగు ఉద్యోగులకు మాత్రమే ఎందుకని యానిమేటర్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఏ చట్టం ప్రకారం తమను తొలిగిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని నాడు పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌..నేడు అధికారంలోకి రాగానే ఉద్యోగుల్ని మోసం చేయడం సరికాదంటున్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కాలపరిమితి నిబంధనపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. వెలుగు ఉద్యోగులను తొలగించి వారి జీవితాలు చీకటిమయం చేయోద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 14, 2022, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.