ETV Bharat / state

Chandrababu focus on Fake Votes: ఓటమి భయంతోనే వైసీపీ అక్రమాలు: చంద్రబాబు

author img

By

Published : Jun 29, 2023, 6:11 PM IST

Chandrababu Review
Chandrababu Review

Chandrababu meeting with leaders about Fake Votes : రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై నేతలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎలక్షన్ కమిటీ సభ్యులతో పార్టీ కార్యాలయంలో సమీక్షించి నిర్వహించిన అనంతరం సమాలోచనలు చేశారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని నేతలు చంద్రబాబుకు తెలిపారు.

Chandrababu Review meeting with TDP leaders : ఓటర్ లిస్ట్​లో అక్రమాలపై నిరంతర అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్​గా తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలు చేసేందుకు ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. పార్టీ పరంగా జరుగుతున్న ఓటర్ వెరిఫికేషన్​పై రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు పార్టీ కార్యాలయంలో సమీక్షించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేశారు.

దొంగ ఓట్లు నమోదుపై ఆగ్రహం: ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని నేతలు చంద్రబాబుకు తెలిపారు. వీటిపై చర్యలు కోరుతూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా వివరాలను ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని చంద్రబాబుకు నేతలు వివరించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నారని భావించే వారి ఓట్లను తొలగిస్తున్నారని నేతలు చంద్రబాబు తెలిపారు. ఒక బూత్​లో ఓట్లను మరో బూత్​కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము కోరామని చెప్పారు.

ఓటర్ వెరిఫికేషన్ ప్రాధాన్యం: నియోజకవర్గాల వారీగా దొంగ ఓటర్ జాబితాలో ఉన్న అనర్హుల ఓట్ల లిస్ట్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చామని నేతలు పార్టీ అధినేతకు వివరించారు. వైసీపీ దొంగ ఓట్ల వంటి అక్రమాలకు పాల్పడుతూ... ఆ బురదను తిరిగి తెలుగుదేశం పార్టీకి అంటించే ప్రయత్నాలను గట్టిగా ఎండగట్టాలని చంద్రబాబు నేతలకు సూచించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఓటర్ వెరిఫికేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నేతలకు సూచించారు. ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చంటూ నాయకులకు చంద్రబాబు సూచించారు. అనర్హులకు ఓట్ల విషయంలో ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేసే ఏ అధికారినీ వదిలేది లేదని చంద్రబాబు నేతలతో అన్నారు.

ఒకే ఇంటి నంబర్​తో పదుల సంఖ్యలో ఓట్లు: ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపుతున్నారంటూ టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజవకర్గంలో ఒకే ఇంటి నంబర్ తో పదులు సంఖ్యలో ఓట్లు ఉన్నాయని మండిపడ్డారు. దొంగ ఓట్లు నమోదు చేసేందుకు కొంత మంది అధికారులు.. అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.