ETV Bharat / state

అక్రమ మైనింగ్ కేసు...యరపతినేని సంస్థల్లో సీబీఐ సోదాలు

author img

By

Published : Nov 19, 2020, 8:14 PM IST

Updated : Nov 19, 2020, 9:08 PM IST

అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా...గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి సంబంధించిన 25 చోట్ల సీబీఐ సోదాలు చేసింది. గుంటూరు జిల్లా, హైదరాబాద్​లో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు విలువైన పత్రాలు, చరవాణులు, ,సుమారు రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Cbi
Cbi

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంస్థల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. యరపతినేని అనుచరులు, సంస్థల్లో సోదాలు చేసింది. డీఓపీటీ నోటిఫికేషన్‌ ప్రకారం యరపతినేనిపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టింది. గుంటూరు జిల్లా, హైదరాబాద్‌లో.. ఆయనకు సంబంధించిన 25 చోట్ల సోదాలు చేపట్టింది. లైమ్‌స్టోన్‌ మైనింగ్‌ వ్యవహారంలో 17 మందిపై సీబీసీఐడీ గతంలో 17 కేసులు నమోదు చేసింది.

హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించింది. 2014-18 మధ్య అక్రమ మైనింగ్‌ జరిగినట్లు సీబీసీఐడీ కేసులు నమోదు చేసిందని సీబీఐ తెలిపింది. మైనింగ్‌ వ్యవహారంలో విచారణ చేస్తున్నట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎంత మేర తవ్వకాలు జరిగాయో శాటిలైట్‌ చిత్రాల ద్వారా గుర్తిస్తామన్ని పేర్కొంది.

గురువారం సీబీఐ చేసిన సోదాల్లో పలు విలువైన పత్రాలు, చరవాణులు, ,సుమారు రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్​పై యరపతినేని సహా మొత్తం 22 మందిపై గతంలో సీబీఐ ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఆరుగురు యరపతినేనికి అత్యంత సన్నిహితులని తెలిపింది.

ఇదీ చదవండి : ఎస్​ఈసీ... ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదు: మంత్రి వెల్లంపల్లి

Last Updated : Nov 19, 2020, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.