ETV Bharat / state

భవనం స్పిన్నింగ్ మిల్లులో బాల కార్మికుల గుర్తింపు... కేసు నమోదు..

author img

By

Published : Jun 18, 2021, 9:45 PM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని భవనం స్పిన్నింగ్​ మిల్లుపై అధికారులు కేసు నమోదు చేశారు. బాల కార్మికులతో పరిశ్రమలో పని చేయిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్​ ఆదేశాల మేరకు కార్మిక, కర్మాగారాల శాఖ, రెవెన్యూ, చైల్డ్​ ప్రొటెక్షన్​ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.

Officers' inspections
అధికారుల తనిఖీలు

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని భవనం స్పిన్నింగ్ మిల్లుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కలెక్టర్​ వివేక్​ యాదవ్​ ఆదేశాల మేరకు కార్మిక, కర్మాగారాల శాఖ, చైల్డ్​ ప్రొటెక్షన్​, రెవెన్యూ, ఐసీడీఎస్​ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామన్నారు. కర్మాగారంలో 25మంది బాల కార్మికులను గుర్తించినట్లు జిల్లా కర్మాగారాల శాఖ అసిస్టెంట్​ ఇన్​స్పెక్టర్​ చిట్టిబాబు తెలిపారు.

పద్నాలుగేళ్ల లోపు వారు నలుగురు, పద్దెనిమిదేళ్ల లోపు కార్మికులు 21 మంది ఉన్నట్లు చెప్పారు. చట్ట వ్యతిరేకంగా బాలలతో పనిచేయిస్తున్నందున కర్మాగారాల చట్టం కింద భవనం స్పిన్నింగ్​ మిల్లుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ సుభాని, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు నాగకోటేశ్వర రావు, సమీర్ కుమార్, గుంటూరు దక్షిణ మండలం డీఎస్పీ ప్రశాంతి, మేడికొండూరు తహసీల్దార్​ కరుణ కుమార్, సీఐ మురళీ కృష్ణ, ఫిరంగిపురం ఐసీడీఎస్ సీడీపీఓ ప్రసూన పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గుంటూరు మెడికల్ క్లబ్ ఎదుట వైద్యుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.