ETV Bharat / state

గ్రామ వాలంటీర్​పై దాడి.. చికిత్స పొందుతూ మృతి

author img

By

Published : Jan 29, 2021, 10:41 AM IST

యువతిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ గ్రామ వాలంటీర్​పై దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పాత ఉప్పలపాడులో జరిగింది.

attack on volunteer over harassment died
గ్రామ వాలంటీర్​పై దాడి

గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పాత ఉప్పలపాడు గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామ వాలంటీర్​పై కొందరు దాడి చేశారు. గ్రామానికి చెందిన నంబుల నాగరాజు (25) వాలంటీర్​గా పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి.. తనను నాగరాజు వేధిస్తున్నాడంటూ కుటుంబ సభ్యులకు చెప్పింది. కోపోద్రిక్తులైన యువతి సోదరులు అతని​పై దాడి చేశారు.

తీవ్ర గాయాలపాలైన నాగరాజును చికిత్స నిమిత్తం తొలుత వినుకొండ పీహెచ్​సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట జీబీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కొన ఊపిరితో కొట్టుకుంటుంటే ఏటీఎం పిన్ అడిగాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.