ETV Bharat / state

AP High Court Judgement on SI Candidate Height Issue: 'అర్హత ఉన్న అభ్యర్థులను అనుమతించండి'.. ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 10:19 AM IST

Updated : Oct 14, 2023, 12:56 PM IST

ap-high-court-judgement-on-si-candidate-height-issue
ap-high-court-judgement-on-si-candidate-height-issue

AP High Court Judgement on SI Candidate Height Issue: ఎస్ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో అభ్యర్థుల ఎత్తును డిజిటల్‌ మెషిన్‌ ద్వారా లెక్కించడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. మాన్యువల్‌ విధానంలో ఎత్తును కొలవాలని పోలీసు నియామక బోర్డును ఆదేశించింది. అందులో అర్హులైన వారిని ప్రధాన రాత పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది.

AP High Court Judgement on SI Candidate Height Issue : ఎస్ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో అభ్యర్థుల ఎత్తును డిజిటల్‌ మెషిన్‌ ద్వారా లెక్కించడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. ఎత్తును కొలిచేందుకు డిజిటల్‌ సామాగ్రిని వినియోగిస్తామని నోటిఫికేషన్లోనే పేర్కొన లేదని గుర్తు చేసింది. గత పది సంవత్సరాలుగా అభ్యర్థుల శారీరక కొలతలను డిజిటల్‌ సామాగ్రిని వినియోగించి నిర్ణయిస్తున్నామన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను అంగీకరిస్తే.. 2018లో అర్హులైన వారు 2023లో ఏ విధంగా అనర్హులు అవుతారని ప్రశ్నించింది. ఓ అభ్యర్థి 2018లో 167.8 సెంటీ మీటర్ల ఎత్తుంటే.. 2023లో నిర్వహించిన పరీక్షలో 166.9 సెంటీ మీటర్లు మాత్రమే ఉన్నట్లు ఫలితం వచ్చిందని గుర్తు చేసింది.

AP High Court New judges: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

High Court Judgment on SI Exams : కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల ఎత్తును లెక్కించే విధానంలో తేడాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 95 మంది పిటిషనర్లను మాన్యువల్‌ విధానంలో ఎత్తును కొలవాలని పోలీసు నియామక బోర్డును ఆదేశించింది. అందులో అర్హులైన వారిని ప్రధాన రాత పరీక్షకు అనుమతించాలని స్పష్టం చేసింది. ఎత్తును కొలిచే ప్రక్రియను మరో మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అధికారులు తీసుకునే నిర్ణయం మరోసారి వివాదానికి తావివ్వకూడదని తెలిపింది. మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 14, 15 తేదీలలో ప్రధాన రాత పరీక్ష నిర్వహించుకునేందుకు అధికారులకు స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంది. అయితే పిటిషనర్లలో అర్హత సాధించిన వారిని కలుపుకొని మాత్రమే ఒకేసారి తుది ఫలితాలు ప్రకటించాలని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

AP High Court on Bandaru Satyanarayana Petition: హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్‌..విచారణ నవంబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు
SI Candidate Height Issue Arguments by Advocate Jada Sravan Kumar : ఎస్ఐ నియామక ప్రక్రియలో డిజిటల్‌ మెషిన్‌ ద్వారా ఎత్తును కొలవడాన్ని సవాలు చేస్తూ 95 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వారి తరఫున న్యాయవాది జడా శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. డిజిటల్‌ సామాగ్రి వినియోగించడంతో గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులయ్యారన్నారు. మాన్యువల్‌ పద్ధతిలో ఎత్తును కొలిచేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. డిజిటల్‌ మెషిన్‌ వినియోగించడంతో సుమారు ఐదు వేల మంది అభ్యర్థులు ఎత్తు విషయంలోనే అనర్హులయ్యారని అన్నారు. డిజిటల్‌ మిషన్‌ ద్వారా అభ్యర్థుల ఎత్తును కొలుస్తారనే విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనలేదన్నారు.

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనల మేరకు వ్యవహరించామన్నారు. గతం 10 ఏళ్లుగా డిజిటల్‌ మెషిన్‌ వినియోగిస్తున్నామన్నారు. అభ్యర్థులు నిలబడే విధానం ఆధారంగా ఎత్తు విషయంలో అతి స్వల్ప తేడాలు కనిపిస్తాయన్నారు. ఈనెల 14,15 తేదీలలో నిర్వహించే ప్రధాన పరీక్ష ప్రక్రియను నిలువరించొద్దన్నారు. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నిర్ణయాన్ని ప్రకటించారు.

High Court Judgment on SI Exams : అర్హత ఉన్న ప్రతి అభ్యర్థిని అనుమతించాలి.. ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు

Last Updated :Oct 14, 2023, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.