ETV Bharat / state

హైదరాబాద్‌లో పేలుళ్లకు ఉగ్రకుట్ర కేసు.. మరొకరు అరెస్ట్​

author img

By

Published : Feb 17, 2023, 1:13 PM IST

Hyderabad Terror conspiracy Case Updates: తెలంగాణలోని హైదరాబాద్‌లో కిందటి ఏడాది విజయదశమి పండుగ సందర్భంగా వరుస ఉగ్రకుట్రకు పథక రచన చేసిన కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత బస్తీకి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ కలీమ్‌ అలియాస్‌ కలీమ్‌ను.. సిట్, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Terror conspiracy Case
Hyderabad Terror conspiracy Case

Terror conspiracy Case Updates: లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ప్రోద్బలంతో తెలంగాణలోని హైదరాబాద్‌లో గత సంవత్సరం దసరా నాడు వరుస పేలుళ్లతో నరమేధానికి పథకాన్ని రచించారు. మహమ్మద్‌ సమీయుద్దీన్, మాజ్‌ హసన్‌ ఫరూక్‌, అబ్దుల్‌ జాహెద్ ఈ మారణహోమాన్ని సృష్టించేందుకు సంసిద్ధమయ్యారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న నగర సీసీఎస్, సిట్‌ పోలీసులు 2022 అక్టోబర్‌ 2న ముగ్గురినీ అరెస్టు చేసి ఆ కుట్రను భగ్నం చేశారు. నిందితుల నుంచి నాలుగు చైనా గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం మరింత సమాచారం రాబట్టారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అబ్దుల్‌ జాహెద్‌ 2005లో టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై బాంబు దాడి కేసులో అరెస్టు అయ్యి.. 2017 ఆగస్టు 2న విడుదలైనట్లు విచారణలో తెలుసుకున్నారు. ఆ తర్వాతా జాహెద్‌ తన స్టైల్​ మార్చుకుని.. హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రకు పథక రచన చేసినట్లు వెల్లడించారు. తన విధ్వంస పథకానికి ఈరోజు అరెస్టైన అబ్దుల్‌ కలీమ్‌ సహకారం తీసుకున్నాడు. వీరితో పాటు ఇర్ఫాన్, మాజ్‌ హసన్‌ ఫరూఖ్, అదిల్‌ అఫ్రోజ్, అబ్దుల్‌ రవూఫ్, సమీయుద్దీన్, వాజిద్‌ ఖాన్, ఉమర్‌ సుబ్రమణ్యంలను నియమించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు పాకిస్థాన్‌ నుంచి వచ్చే హవాలా డబ్బును చేరవేసే బాధ్యత కలీమ్‌ తీసుకున్నాడని పోలీసుల విచారణలో బహిర్గతమైంది.

Hyd terror conspiracy case: విజయదశమి రోజున పేలుళ్ల కోసం చైనాలో తయారు చేసిన 86పీ మిలిటరీ గ్రనేడ్లను కశ్మీర్‌ ద్వారా భారతదేశానికి చేర్చారు. పాకిస్థాన్‌లోని మాజిద్‌.. వాట్సాప్‌ ద్వారా గ్రనేడ్లు ఉంచిన ప్రాంతాన్ని ఫొటోలు తీసి అబ్దుల్‌ జాహెద్‌కు పంపాడు. గత సంవత్సరం సెప్టెంబరు 28న మాజిద్‌ ఆదేశాలతో సమీయుద్దీన్‌ ఎన్‌ఫీల్డ్‌ వెహికల్​పై మనోహరాబాద్‌ టోల్‌ ప్లాజా(ఎన్​ హెచ్​-44) వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో మేడ్చల్‌ వద్ద హ్యాండ్​ బ్యాగ్​ కొన్నాడు. మనోహరాబాద్‌ సమీపంలోని డెడ్‌ డ్రాప్‌ దగ్గర నాలుగు గ్రనేడ్లను నగరానికి తీసుకొచ్చాడు. మాజ్‌, సమీయుద్దీన్ చెరో గ్రనేడ్‌ తీసుకున్నారు. మిగిలిన రెండు జాహెద్‌కు అప్పగించాడు. సమావేశాలు, ఉత్సవాలను ప్రధాన లక్ష్యం చేసుకుని వాటిని విసరాలన్నది కుట్ర.

అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మాజ్‌ హసన్‌ ఫరూఖ్‌, సమీయుద్దీన్, అబ్దుల్‌ జాహెద్​ను అరెస్టు చేశారు. చైనా మేడ్‌ మిలటరీ గ్రనేడ్లు, దాదాపు రూ.20 లక్షల హవాలా డబ్బు, జాహెద్, మాజిద్‌ మధ్య ఫోన్​ రికార్డింగ్స్​ సేకరించారు. గ్రనేడ్లు తీసుకెళ్లే సమయంలో సైదాబాద్‌-మనోహరాబాద్‌ వరకు 60 కిలో మీటర్ల మార్గంలో 10 సీసీ దృశ్యాలను సేకరించారు.

దసరా పండుగ నేపథ్యంలో వరుస పేలుళ్లతో నరమేధం సృష్టించేందుకు సిద్ధమైన అబ్దుల్‌ జాహెద్‌ అలియాస్‌ మోటు, మహ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ సమి, మాజ్‌ హసన్‌ ఫరూక్‌ అలియాస్‌ మాజ్‌లకు పాకిస్థాన్‌ నుంచి వచ్చిన డబ్బును అబ్దుల్‌ కలీమ్‌ చేరవేశాడని సాక్షాధారాలతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.