ETV Bharat / state

'ఒకటి రెండు ప్రయత్నాల్లో విఫలమైతే నిరుత్సాహపడకూడదు'

author img

By

Published : Sep 27, 2020, 10:46 AM IST

ఆలిండియా సివిల్స్ 76వ ర్యాంకర్ మల్లవరపు సూర్యతేజను విజ్ఞాన్​లో ఘనంగా సన్మానించారు. రాష్ట్రానికి ఐఏఎస్ అధికారిగా సేవలందించడానికి సూర్యతేజ ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు.

Allindia Civils rankers
సూర్యతేజకు విజ్ఞాన్ లో ఘన సన్మానం

ఐఏఎస్ సాధించటంతో పాటు ప్రజలకు వినూత్న సేవలను అందించగలిగితేనే ఆ పదవికి సార్ధకత లభిస్తుందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య సూచించారు. గుంటూరులోని విజ్ఞాన్​లో చదువుకొని ఆలిండియా సివిల్స్ లో 76వ ర్యాంకు సాధించిన సూర్యతేజను ఘనంగా సన్మానించారు. చదువుతో పాటు సమాజంపై అవగాహనను నేర్పించడం వలనే ఈ రోజు విద్యార్థులు వారి జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. జీవితంలో మనం ఎన్ని శిఖరాలను అధిరోహించినా, మనం ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులను మరువకూడదని మరో ముఖ్య అతిథిగా హాజరైన టుబాకో బోర్డు చైర్మన్ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఒకటి, రెండు ప్రయత్నాల్లో రానంత మాత్రాన నిరుత్సాహపడకూడదని.. తాను మొదటి మూడు సార్లు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదని, నాలుగో ప్రయత్నంలో ఇంటర్య్వూ వరకు వెళ్లానని సూర్యతేజ వెల్లడించారు. చివరగా ఐదో ప్రయత్నంలో ఆలిండియా స్థాయిలో 76వ ర్యాంకు సాధించడంతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచానని పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

నా అన్నవారు రాక... అక్కున చేర్చుకునేవారు లేక!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.