గులాబ్ తుపాను ప్రభావం(gulab effect)తో ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా (east godavari district) రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని వై.రామవరం మండలం పాతకోట పంచాయతీ చలకవీధి లంక గ్రామానికి చెందిన ఓ గర్భిణీకి సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో సమీపంలో ఉన్న గుర్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు మారేడుమిల్లికి రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించంటంతో.. గర్భిణీని తరలించటానికి కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గర్భిణీని వాగు దాటించి.. తమ ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె మారేడుపల్లిలో చికిత్స పొందుతున్నారు.
విశాఖ జిల్లా(visakha district) జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ సిందుగులలో ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామం పక్కన ఉన్న కుక్కలగుమ్మి గడ్డ పొంగి ప్రవహించటంతో.. స్థానికులు డోలీ మోసి అతి కష్టం మీద గర్భిణీని రహదారి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం అంబులెన్సులో పాడేరు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి