ETV Bharat / state

ఆడుకుంటూ కుప్పకూలిన విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి

author img

By

Published : Mar 7, 2021, 8:09 AM IST

పాఠశాల మైదానంలో ఆడుకుంటుండగా ఓ విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరిగింది.

student playing collapsed and died at eastgodavari district
ఓ విద్యార్థి ఆడుకుంటూ.. కుప్పకూలి మృతి

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఓ విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందాడు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం వై.రామవరం మండలం బంగారుబందలు గ్రామానికి చెందిన కోండ్లమంగిరెడ్డి మారేడుమిల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మైదానంలో ఆడుకుంటుండగా.. అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు.

అతడిని ఉపాధ్యాయులు హుటాహుటిన స్థానిక పీహెచ్​సీకి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని రంపచోడవరం ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ శిరీష తెలిపారు. విద్యార్థి మృతిపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం.సరస్వతి పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.

ఇదీ చూడండి:

చివరి దశకు చేరుకున్న పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.