ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నూతన ఐఏఎస్ అధికారులు

author img

By

Published : Mar 13, 2021, 11:35 AM IST

రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన పది మంది ఐఏఎస్ అధికారులు.. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇరిగేషన్ వ్యవస్థపై అవగాహనలో భాగంగా వీరంతా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు.

New IAS officers
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నూతన ఐఏఎస్ అధికారులు

వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నూతన ఐఏఎస్ అధికారులు

రాష్ట్రంలో నూతనంగా ఎంపికైన పది మంది ఐఏఎస్ అధికారులు.. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇరిగేషన్ వ్యవస్థపై అవగాహన నిమిత్తం వీరంతా జిల్లాలోని ధవళేశ్వరం, ఆత్రేయపురం మండలాల్లో పర్యటించారు.

అక్కడి సాగు నీటి ప్రధాన కాలువలపై స్థానిక అధికారులను వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్​తో కలిసి స్వామి వారిని దర్శింకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘనస్వాగతం పలికి.. స్వామి వారి చిత్ర పటాలను అందించారు.

ఇదీ చదవండి:

అసాధారణంగా పెరిగిన పెండలం.. రైతు ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.