ETV Bharat / state

విద్యార్థులకు నెలవుగా.. రాయితో నిర్మించిన భవనం

author img

By

Published : Mar 19, 2021, 5:03 PM IST

అదో ప్రభుత్వ పాఠశాల.. రాతి బడిగా పేరుపొందింది. ఇదేమిటి రాతి బడి అనుకుంటున్నారా.. అయితే దాని విశిష్టత తెలియాలంటే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లాల్సిందే.

school constructed with stone at amalapuram in east godavari
విద్యార్థులకు నెలవుగా.. రాయితో నిర్మించిన భవనం



తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల.. రాతి భవనంలో నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో 1910 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించారు. దీంట్లో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు.. రాళ్లతోనే నిర్మించారు. ఈ భవనం కూడా రాయితోనే నిర్మించారు. సువిశాలమైన గదులు, ఆర్చీలు, పెద్ద తలుపులు, కిటికీలు, చక్కటి వెలుతురు, స్వచ్ఛమైన గాలి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ రాతి భవనం ఉంది.

ఈ భవనం కట్టి 110 సంవత్సరాలైనా.. ఎక్కడా చెక్కుచెదరలేదు. నాటి నాణ్యత ప్రమాణాలకు ఈ భవనం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. రాతితో నిర్మించిన ఈ భవనంలో పాఠశాల నడుపుతున్న కారణంగా.. దీనికి రాతి బడి అని పేరువచ్చింది. విద్యార్థులుఈ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.. ఉపాధ్యాయులు సైతం ఎంతో ఆనంద పడుతుంటారు.

ఇదీ చదవండి: నమ్మకమూ.. పట్టుదల.. తన రెండు రెక్కలుగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.