ETV Bharat / state

అన్నదమ్ములు.... 108 ద్విచక్ర వాహనాలను దోచేశారు!

author img

By

Published : Oct 8, 2020, 5:00 PM IST

bike thieves arrested
bike thieves arrested

వారిద్దరూ వరసకు సోదరులు. కూలి పని చేసుకుని జీవనం సాగించేవారు. అయితే జల్సాలకు అలవాటుపడి అడ్డదారి తొక్కారు. కళ్లకు కనిపించిన ద్విచక్ర వాహనాన్ని క్షణాల్లో మాయం చేసేవారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 108 ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు ఈ కేటుగాళ్లు. ఎట్టకేలకు వారిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

bike thieves arrested
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు

ద్విచక్ర వాహనాల్లో దొంగతనాల్లో ఆరితేరిన ఇద్దరు వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ 108 వాహనాలను చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి గురువారం మీడియాకు వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన కావిడి నాని సింగం(25), బండి శివ(22)లు వరసకు సోదరులు. కూలిపని చేసుకునే వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బులు సరిపోక ద్విచక్ర వాహనాలు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో మహారాష్ట్రలో రెండు ద్విచక్ర వాహనాలు దొంగలించి పోలీసులకు పట్టుబడ్డాడు సింగం. అతనిపై అనుమానం పెంచుకున్న ఆలమూరు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. నిందితులిద్దరూ ఉభయగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 108 వాహనాలు చోరీ చేసినట్లు గుర్తించారు. వీరు దొంగిలించిన వాహనాలను మడికి గ్రామానికి చెందిన కతేటి చిన్న, సింగం హరి దుర్గా ప్రసాద్, కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన చింతల లావరాజు, రాజనగరం మండలానికి చెందిన గుత్తుల శ్రీనులు విక్రయించేవారని పోలీసులు గుర్తించారు. నిందితులతో పాటు వారికి సహకరించిన నలుగురిని ఆలమూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.