ETV Bharat / state

బియ్యం లారీ ఆపి డబ్బులు డిమాండ్​.. ఆరుగురు విలేకరులు అరెస్ట్​

author img

By

Published : Jul 15, 2021, 3:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో బియ్యం లారీని ఆపి డబ్బులు డిమాండ్​ చేసిన ఆరుగురు విలేకరులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి నుంచి కాకినాడకు బియ్యం బస్తాలు రవాణా చేస్తున్న లారీని ఆపి 2 లక్షలు డిమాండ్​ చేశారు.

police arrested six reporters for demanding money from lorry drivers
police arrested six reporters for demanding money from lorry drivers

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వివిధ పత్రికలకు చెందిన ఆరుగురు విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బియ్యం లారీని ఆపి డబ్బులు డిమాండ్​ చేసిన ఘటనలో.. వీరిపై కేసు నమోదు చేశారు.

ఈ నెల 14న గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి నుంచి.. కాకినాడకు బియ్యం బస్తాలు రవాణా చేస్తున్న లారీని నిందితులు అడ్డుకున్నారు. ఏడుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి.. లారీని ఆపారు. డ్రైవర్​ను దిగమన్నారు. బియ్యం బస్తాలకు సంబంధించిన బిల్లు చూపించమని అడిగారు. డ్రైవర్ బిల్లు చూపించగా.. అది రేషన్ బియ్యమని విలేకరులు వాదించారు. డైవర్​ను యజమానికి ఫోన్​ చేయాలని డిమాండ్ చేశారు. రైస్​ మిల్​ గుమస్తాతో మాట్లాడి.. రెండు లక్షలు ఇస్తేనే లారీని విడిచి పెడతామన్నారు. లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. లారీ సీజ్​ చేస్తామని హడలెత్తించారు. డబ్బులు ఇచ్చేది లేదని గుమాస్తా తేల్చి చెప్పాగా.. నిందితులు ఎమ్మార్వోకు ఫోన్​ చేశారు. అనంతరం పౌర సరఫరా అధికారులు వచ్చి బియ్యం బస్తాలు తనిఖీ చేయగా.. సాధరణ బియ్యమే అని తేలింది.

ఈ ఘటనపై.. రైస్​ మిల్​ యజమాని ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేశామని డీఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్​ చేశామని.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని వెల్లడించారు.

ఇదీ చదవండి:

Viveka Murder Case: 39వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.