ETV Bharat / state

బోడసకుర్రులో కొవిడ్ కేర్ సెంటర్ సిద్ధం

author img

By

Published : Apr 26, 2021, 9:34 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని బోడసకుర్రులో కొవిడ్​ కేర్​సెంటర్​ను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం వెయ్యి పడకలు సిద్ధం ఉన్నాయని.. అవసరాన్ని బట్టి మరో వెయ్యి పడకల సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.

covid Care Center
కొవిడ్ కేర్ సెంటర్

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని బోడసకుర్రులో కొవిడ్​ కేర్​సెంటర్​ను అధికారులు సిద్ధం చేశారు. ఇక్కడి టిడ్కో భవనాలను గత ఏడాది కొవిడ్ కేర్ సెంటర్​గా వినియోగించారు. అప్పట్లో కరోనా ప్రభావం తగ్గుతుండటంతో దాన్ని మూసివేశారు. ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం వెయ్యి పడకలను సిద్ధం చేశామని.. అవసరం అనుకుంటే మరో వెయ్యి పడకలు సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సెంటర్​లో పనిచేసే సిబ్బందికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండీ.. విశాఖ ఉక్కు ఘనత: 12 రోజుల్లో 1,300 టన్నుల ఆక్సిజన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.