ETV Bharat / state

స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల పడిగాపులు

author img

By

Published : May 24, 2020, 5:47 PM IST

లాక్​డౌన్ కారణంగా బీహార్‌, ఝార్ఖండ్‌ వాసులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు... తూర్పుగోదావరి జిల్లాలో పడిగాపులు కాస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి ఝార్ఖండ్​కు చెందిన 35మంది వలస కూలీలను శ్రామిక రైలులో పంపించారు.

migrant labourers problems strucked in east godavari district
స్వస్థలాలకు వెళ్లేందుకు పడిగాపులు కాస్తులు వలసకార్మికులు

తూర్పుగోదావరి జిల్లాలో బిహార్‌, ఝార్ఖండ్‌ వాసులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇంకా పడిగాపులు పడుతున్నారు. అనపర్తి, ద్వారపూడి, కాట్రేనికోన తదితర ప్రాంతాల్లోని చిన్న తరహా పరిశ్రమల్లో కూలీలుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించిన సమయం నుంచి వీరు అక్కడే ఉండిపోయారు. వీరికి అన్ని పరీక్షలు నిర్వహించిన అధికారులు స్వస్థలాలకు పంపించేందుకు అనుమతి పత్రాలు జారీ చేశారు. రాజమహేంద్రవరం నుంచి శ్రామిక రైలులో 35 మంది ఝార్ఖండ్‌ వాసులను పంపించగా... బిహార్​కు చెందిన వారంతా రాజమహేంద్రవరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పడిగాపులు కాస్తున్నారు.

ఇదీ చదవండి:

వలస కూలీల ఆకలి తీర్చిన సత్యసాయి సేవా సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.