ETV Bharat / state

ఎడతెరిపిలేని వర్షాలు.. నీటమునిగిన పంటలు

author img

By

Published : Oct 23, 2019, 1:04 PM IST

అకాల వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా వణుకుతోంది. మరో 10రోజుల్లో చేతికొస్తుందనుకున్న వరిపంట... వానలకు నీటమునిగింది. అన్నదాతల కంట్లో కన్నీరు మిగిల్చింది.

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలం అవుతోంది. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరి చేలు నీటమునిగాయి. రామచంద్రాపురం నియోజకవర్గంలోని మండపేట, కపిలేశ్వరపురం, కాజులూరు మండలాల్లోని వేల హెక్టార్లలో పంట నీటిపాలైంది. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామనీ... వర్షాలతో అంతా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. 10రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఇలా నీటిపాలైందనీ... ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

అటు కోనసీమలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరిచేలు నీటమునిగి నానుతున్నాయి. రహదారులపై గుంతల్లో నీరు నిలిచి అధ్వానంగా తయారయ్యాయి. అమలాపురం, పీ. గన్నవరం, రాజోలు, ముమ్మడివరం, అయినవిల్లి, మామిడికుదురు, అంబాజీపేట, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో కుండపోత వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రైతులు చెప్పారు.

ఇవీ చదవండి..

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Intro:AP_RJY_56_23_NEETAMUNIGINAVADAPALLI_AV_AP10018
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్‌: ఎస్‌.వి.కనికిరెడ్డి
కొత్తపేట

జోరు వర్షం కారణంగా తూర్పుగోదావరిజిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి వర్షం నీరు చేరింది.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆలయ ప్రాంగణాలు అన్నీ నీటమునిగాయి. ప్రసుత్తం స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగున్న
నేపథ్యంలో వర్షం నీరు చేరడంతో పూజలకు ఆటంకం ఏర్పడింది. హోమాలు నిర్వహించేందుకు ఏర్పాటు యాగశాలలు సైతం మునిగిపోయాయి. ఆలయం చుట్టూ వర్షం నీరు నిలిచిపోవడంతో బ్రహ్మోత్సవాలకు ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ అధికారులు మోటర్ల సాయంతో వాటర్‌ను బయటకి తరలిస్తున్నారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.