ETV Bharat / state

వర్షాలు గలగల... రిజర్వాయర్లకు జలకళ..!

author img

By

Published : Oct 22, 2019, 5:38 PM IST

Updated : Oct 22, 2019, 11:24 PM IST

రాష్ట్రంలో కుండపోత వర్షాలకు జలాశయాలు నిండిపోతున్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరువయ్యాయి. కొన్ని చోట్ల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాల కారణంగా కోనసీమ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది.

heavy-rains-in-andhrapradesh

నిండుకుండలా మారిన జలాశయాలు

విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కరుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జలశయాలు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. విశాఖలోని తాండవ జలాశయ నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 365 అడుగులకి నీరు చేరుకుంది. గడచిన ఐదేళ్లతో పోలిస్తే నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఈ జలాశయం ద్వారా 52 వేల ఎకరాల భూమి సాగవుతోందని...నీరు పుష్కలంగా ఉండటంతో వచ్చే ఏడాదికి సైతం నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. మాడుగుల నియోజకవర్గంలోని జలాశయాలు సైతం ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంత ప్రజలు కుండపోత వర్షాలకు వణికిపోతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమై వాహనచోదకులు ఇక్కట్లు పడుతున్నారు. వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రహదారులు గుంతలు పడి వాహనచోదకులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు వర్షాలతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది అమలాపురం తో పాటు ఉ పి గన్నవరం ముమ్మడివరం మామిడికుదురు అంబాజీపేట అయినవిల్లి తదితర మండలాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:వర్షాలు


Conclusion:కుండపోత వర్షాలు
Last Updated : Oct 22, 2019, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.