ETV Bharat / state

వీడని వరద.. ఆరు గ్రామాల్లో తీరని బెడద

author img

By

Published : Aug 11, 2019, 9:04 PM IST

గోదావరిలో వరద ప్రవాహం తగ్గినప్పటికీ దేవీపట్నంలో మండలంలోని కొన్ని గ్రామాల్లో పరిస్థితులు మారలేదు. ఆరు గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.

వరద

వీడని వరద.. ఆరు గ్రామాల్లో తీరని బెడద

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ.. దేవీపట్నం మండలంలో ఆరు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద తగ్గిన తర్వాత గ్రామాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దేవీపట్నంతో పాటు తొయ్యేరు, వీరవరం, అగ్రహారం, పోశమ్మగండి, పూడిపల్లి, చినరమణయ్యపేట, ఏనుగులగూడెం తదితర గ్రామాలన్నీ ఇంకా ముంపులోనే ఉన్నాయి. మరో రెండు రోజులు వరద ఉద్ధృతి పూర్తిగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముంపు బాధితులకు 5లీటర్ల కిరోసిన్‌, 25కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అదనంగా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5వేల చొప్పున ప్రకటించారు. ఇళ్లు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అధికారులు తెలిపారు. వరద నష్టాలపై అధికారులకు నివేదికలు తయారుచేస్తున్నారు.

అయితే తమ గ్రామాల్లో అంతంతమాత్రంగానే సహాయం అందిందని అగ్రహారం, ఏనుగులగూడెం గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగేందుకు కనీసం బోట్లు సైతం ఏర్పాట్లు చేయకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయి అంధకారంలోనే ఉంటున్నామని వారు వాపోతున్నారు.

Intro:రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని శాసనసభ డెప్యుటి స్పీకర్ కోన రఘుపతి అన్నారు. చిత్తూరు నగరంలో ఆదివారం నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్య మంత్రి జగన్ సిద్దంగా ఉన్నారని చెప్పారు. సమాజంలో బ్రాహ్మణులను అన్ని విధాలుగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శంకర బ్రాహ్మణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.Body:.Conclusion:.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.