ETV Bharat / state

బాలికపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్

author img

By

Published : Jul 19, 2020, 11:30 AM IST

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడిలో ఈ నెల 12న బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

east godavari dst police arrested the culpirts of a rape on minor girl
east godavari dst police arrested the culpirts of a rape on minor girl

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడిలో మైనర్​పై అత్యాచారం చేసిన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజమహేంద్రవరంలో పని చేసేందుకు వెళ్లి ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఈ నెల 12న కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలికను కుటుంబసభ్యులు ఆరా తీయటంతో అనిత అనే యువతి తనను ఆటోలో ఎక్కించుకుని వెళ్లిందని తెలిపింది. ఆపై కొంత మంది యువకులు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను కుటుంబసభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సంబంధమున్న అందరినీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి

గంజాయి ముఠా గుట్టురట్టు.. 55కిలోల సరకు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.