ETV Bharat / state

Jagananna Vidya Deevena: రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలంతా అండగా నిలవాలి: సీఎం జగన్

author img

By

Published : May 24, 2023, 7:34 PM IST

Updated : May 24, 2023, 8:04 PM IST

Jagananna Vidya Deevena
జగనన్న విద్యాదీవెన

Jagananna Vidya Deevena Scheme in AP: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పేద కుటుంబాల పిల్లలు చదువు ద్వారా అభివృద్ధి చెందేలా.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. విద్యపై ప్రభుత్వం భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటే.. రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు.

Jagananna Vidya Deevena Scheme : పేద కుటుంబాల పిల్లలు చదువు ద్వారా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ప్రోత్సాహాలు అందిస్తోందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. విద్యా పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే నాలుగేళ్లలో అక్కాచెల్లెళ్ల ఖాతాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు నగదు జమ చేశామన్న జగన్.. తాను ఇంతలా పేదల కోసం తపిస్తుంటే ప్రతిపక్షాలు అందరూ తోడేళ్లులా కలిసి వచ్చి తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలంతా తనకు అండగా నిలవాలని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యాదీవెన సభలో పాల్గొని ప్రసంగించారు.

బస్సులో రోడ్ షో: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటించారు. జగనన్న విద్యాదీవెన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. కొవ్వూరు హెలికాఫ్టర్ లో చేరుకున్న సీఎం...అక్కడి నుంచి హోం మంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభ వద్దకు బస్సులో రోడ్ షో నిర్వహించారు. నిరుపేదలు సామాజికంగా ఎదగాలన్నా, వివక్ష పోవాలన్నా.. వారికి చదువే గొప్ప అస్త్రమని జగన్ అన్నారు. 9 లక్షల 95 వేల మంది పిల్లల తల్లుల ఖాతాల్లో 703 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జమ చేశారు. విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు 10 వేల 636 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు. విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా చదువుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయన్న సీఎం... ప్రతి పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలని పిలుపునిచ్చారు.

సైనికుల్లా నిలవాలని పిలుపు: పేదల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం వెచ్చిస్తుంటే, ప్రతిపక్షాలందరూ తోడేళ్లలా కలిసి వచ్చి తనపై విమర్శలు గుప్పిస్తున్నారని జగన్ అన్నారు. ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతోందని.. పేదలందరూ ఒ వైపు, పెత్తందార్లు మరో వైపు ఉన్నారని అన్నారు. మీ అందరికీ లబ్ది చేకూరిందని భావిస్తే జగన్​కు సైనికుల్లా నిలావాలని పిలుపునిచ్చారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

పాల్గొన్న మంత్రులు: జగనన్న విద్యాదీవెన సభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, కొట్టు సత్యనారాణయ, వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సభకు రాజమహేంద్రవరం సహా గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థుల్ని తరలించారు. సభ ముగిసిన తర్వాత తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోతకు అల్లాడారు.

ఇవీ చదవండి:

Last Updated :May 24, 2023, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.