ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు @7am

author img

By

Published : Dec 26, 2022, 6:59 AM IST

..

7am topnews
ప్రధానవార్తలు 7am

  • గుడివాడలో ఉద్రిక్తత.. తెదేపా మాజీ ఎమ్మెల్యేను చంపేస్తామని బెదిరింపులు
    కృష్ణజిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును చంపేస్తామంటూ వైసీపీ నేత బెదిరింపులకు దిగడంతో వివాదం చెలరేగింది. వైసీపీ నాయకుడు మెరుగుమాల కాళీ.. రావి వెంకటేశ్వరావుకి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడటంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాయచోటి భూదందా కేసు.. ఏడుగురు వైసీపీ నేతలపై క్రిమినల్‌ కేసులు
    YCP Leaders Land Kabza : రాయచోటిలో వైసీపీ నాయకుల భూదందాపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 120 కోట్ల విలువచేసే 13 ఎకరాల ప్రభుత్వ భూమి క్రయవిక్రయాలు చేసిన ఏడుగురిపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అనుచరులే. భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన కడప రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ శ్యామలాదేవిపైనా క్రిమినల్ కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నేడు శ్రీశైలానికి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లు పూర్తి
    President Draupadi Murmu Visits Srisailam On Monday: సోమవారం శ్రీశైలానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. రాష్ట్రపతి విందు కోసం అలంకార మండపాన్ని సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పదవులు ఐదేళ్లే.. రంగా అబ్బాయిగా ఉండటమే గొప్ప'
    Vangaveeti Mohana Ranga Statue Inaugration: వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకృష్ణను ఓన్‌ చేసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు నున్న సెంటర్‌లో కారు దిగి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి దండ వేయగా.. రాధా మాత్రం కారు దిగలేదు. పదవులు ఐదేళ్లే ఉంటాయని తనకు రంగా అబ్బాయిగా ఉండటమే గొప్ప అని.. వంగవీటి రాధాకృష్ణ అన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం వంగవీటి రంగా ప్రాణత్యాగం చేశారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అగ్నివీర్' అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రారంభం.. 2,850 మందికి ఆరు నెలల శిక్షణ
    అగ్నిపథ్ పథకం ద్వారా వైమానిక దళానికి ఎంపికైన అభ్యర్థులకు బెళగావిలో సైనిక శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 2,850 మంది ఆరునెలల పాటు ఈ ట్రైనింగ్​ తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశంలో కొత్త వేరియంట్ కలవరం.. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​
    చైనాలో విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 భారత్‌ను భయపెడుతోంది. తాజాగా రెండు రోజుల క్రితం చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. అతడి శాంపిల్స్​ను జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్​కు పంపారు అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నేపాల్ పొలిటికల్ డ్రామా.. కుప్పకూలిన సంకీర్ణం.. తదుపరి ప్రధానిగా ప్రచండ
    నాటకీయ పరిణామాల మధ్య నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు సీపీఎన్-ఎంసీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ప్రచండ. ప్రధాని పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలన్న ఒప్పందంపై సంధి కుదరకపోవడం వల్ల.. ప్రస్తుత సంకీర్ణ కూటమి విచ్ఛిన్నం కాగా.. మాజీ ప్రధాని ఓలితో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రచండ సిద్ధమయ్యారు. ఆయన నియామకానికి నేపాల్ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వివాదాస్పద పోస్టులకు శార్దూల్‌ 'లైక్‌'లు.. టీమ్‌ఇండియాలో రాజకీయం జరుగుతోందా?
    బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకొంది. అయితే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ శార్దూల్‌ ఠాకూర్‌కు మాత్రం ఆడేందుకు అవకాశం రాలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పెళ్లి చేసుకున్న భీమ్లానాయక్​ నటి గోవాలో డెస్టినేషన్​ వెడ్డింగ్​
    మౌనిక రెడ్డి. తెలుగు యూట్యూబ్​ ప్రపంచానికి దాదాపు పరిచయం అక్కర్లేని పేరు. ఈ తెలుగమ్మాయి తన అందం అభినయంతో కుర్రకారు మనసు దోచుకుంది. పలు షార్ట్​ ఫిల్మ్స్​లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కింది. అదిరిపోయేలా గోవాలో డెస్టినేషన్​ వెడ్డింగ్​ చేసుకుంది. తాజాగా పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్లేక్షకులతో పంచుకుంది. ఆ ఫొటోలు మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ బాలీవుడ్​ భామల కాస్ట్లీ కాస్ట్యూమ్స్​ ధర ఎంతో తెలుసా
    ప్రస్తుతం సినీ పరిశ్రమలో కథానాయికల రూటే సెపరేటు. అందంగా కనిపించటానికి కాస్ట్యూమ్స్​ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఎన్నో వేలు పెట్టి మరీ దుస్తులను ప్రత్యేక డిజైనర్లతో తయారు చేయించుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్​ హీరోయిన్స్​ తేజస్వి ప్రకాశ్​, భూమి పెడ్నేకర్​ ధరించిన దుస్తుల ధరెంతో తెలిస్తే అవునా అనాల్సిందే. మరి వారి కాస్ల్టీ కాస్ట్యూమ్స్​పై మనమూ ఓ లుక్కేద్దామా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.