ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్​పై దుండగుల దాడి.. పరిస్థితి విషమం

author img

By

Published : Jul 15, 2020, 6:20 PM IST

పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి దిగారు దుండగలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బీ.కొత్తకోటలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. మదనపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

murder attempt on a person
పట్టపగలే కత్తులతో దాడి చేసిన దుండగలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోటలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తిని ఆర్టీసీ డ్రైవర్​గా పని చేస్తున్న బావాజాన్​గా పోలీసులు గుర్తించారు.

బాధితుడికి మెుదట బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించినా.. పరిస్థితి విషమించిన కారణంగా.. మెరుగైన వైద్య కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బీ.కొత్తకోట ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఆలయం తెరిచి ఉంది.. కానీ వెళ్లేందుకు దారిలేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.