ETV Bharat / state

నంది విగ్రహం అదృశ్యం...స్వర్ణముఖి నదిలో లభ్యం

author img

By

Published : Apr 10, 2021, 10:41 PM IST

The missing Nandi idol is found in the Swarnamukhi river
స్వర్ణముఖి నదిలో అదృశ్యమైన నంది విగ్రహం లభ్యం

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని దేవలంపేట శివాలయంలో అదృశ్యమైన నంది విగ్రహం శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని దేవలంపేట శివాలయంలో ఇటీవల అదృశ్యమైన నంది విగ్రహం శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో లభ్యమైంది. బంగారుపాలెం ఎస్ ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణముఖి నదిలో ధ్వంసం చేసిన నంది విగ్రహం ఆనవాళ్లను గుర్తించారు.

గుప్తనిధుల కోసమే నంది విగ్రహం తవ్వకాలు చేపట్టి... అనుమానం రాకుండా స్వర్ణముఖి నదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

నీలూరు వంతెన పైనుంచి పడిపోయిన లారీ..2 గంటల్లోనే మరో వాహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.