ETV Bharat / state

Swarnamukhi bridge collapsed: ప్రభుత్వం స్పందించలేదు..వారే రోడ్డు వేసుకున్నారు

author img

By

Published : Dec 4, 2021, 8:52 PM IST

ప్రభుత్వం స్పందించలేదు..వారే రోడ్డు వేసుకున్నారు
ప్రభుత్వం స్పందించలేదు..వారే రోడ్డు వేసుకున్నారు

Swarnamukhi bridge collapsed: తిరుపతి రూరల్ మండలం చిగురువాడ వద్ద భారీ వరదకు 20రోజల క్రితం స్వర్ణముఖి వంతెన కొట్టుకుపోయింది. అధికారులు స్పందించకపోవడంతో స్వయం సహాయక సంఘం మహిళలు ఏకమై ప్రత్యామ్నాయంగా రోడ్డు వేసుకున్నారు.

Swarnamukhi bridge collapsed: చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం చిగురువాడ వద్ద భారీ వరదకు 20రోజల క్రితం స్వర్ణముఖి వంతెన కొట్టుకుపోయింది. దీంతో సమారు 100 గ్రామాలకు దారిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి మరమ్మత్తులు చేస్తుందేమో ఆని ఎదురుచూశారు. కానీ 20 రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించలేదని మహిళలు తెలిపారు. దాంతో కూచంద్రపేటకు చెందిన స్వయం సహాయక సంఘం మహిళలు ఏకమై ప్రత్యామ్నాయంగా రోడ్డు వేసుకున్నారు. మహిళలు వాగులోని ఇసుకను మూటలతో నింపడం చూసిన గ్రామస్థులు ట్రాక్టర్​ను తెచ్చి సహాయం అందించారు. మిగతా గ్రామప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఇకనైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: JAWAD CYCLONE: దిశ మార్చుకున్న జవాద్​.. ఒడిశా వైపు పయనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.