ETV Bharat / state

case registered: చంద్రబాబుపై బాంబులేస్తామన్న.. కుప్పం వైకాపా నేతపై కేసు

author img

By

Published : Oct 23, 2021, 1:18 PM IST

కుప్పం వైకాపా నేత సెంథిల్ పై కేసు నమోదైంది. తెదేపా అధినేత చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

కుప్పం వైకాపా నేత సెంథిల్​ పై కేసు నమోదు
కుప్పం వైకాపా నేత సెంథిల్​ పై కేసు నమోదు

చిత్తూరు జిల్లా కుప్పం వైకాపా నేత సెంథిల్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న.. స్థానిక తెదేపా నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిన్న వైకాపా జనాగ్రహ దీక్షలో.. రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌ కుమార్‌ (RESCO senthil kumar).. తెదేపా అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) సహా పలువురు పార్టీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారని వార్తలు వచ్చాయి.

తెదేపా నేతలను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు.. చంద్రబాబు వాహనంపై బాంబు వేస్తానని బెదిరింపులకు పాల్పడటం విమర్శలకు దారి తీసింది. వైకాపా నేత వ్యాఖ్యలపై తెదేపా శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు తెదేపా నాయకులు వెళ్లగా.. వారిని అడ్డుకునేందుకు వైకాపా నాయకులు యత్నించారు. ఈ క్రమంలో వైకాపా నేతలను పోలీసులు వెనక్కి పంపుతుండగా.. ఇద్దరు నాయకులు అర్బన్‌ సీఐని తోసేశారు. దీంతో.. కుప్పంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:

28న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.