ETV Bharat / state

వృద్ధురాలి హత్య కేసు ఛేదించిన పోలీసులు

author img

By

Published : Jan 9, 2021, 10:08 AM IST

చిత్తూరు జిల్లా కొత్తగొల్లపల్లి గ్రామంలో ఈ నెల 4 వ తేదిన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

వృద్ధురాలి హత్యకేసును చేధించిన పోలీసులు
వృద్ధురాలి హత్యకేసును చేధించిన పోలీసులు

చిత్తూరు జిల్లా తవణం పల్లి మండలం కొత్తగొల్లపల్లి గ్రామంలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. గొల్లపల్లికి చెందిన మంగమ్మ.. ఆవుల షెడ్డులో నిద్రిస్తుండగా ఈ నెల 4 వ తేదిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై దాడి చేసి అత్యాచారం చేసినట్లు చెప్పారు.

దర్యాప్తులో భాగంగా కొత్త గొల్లపల్లి గ్రామానికి చెందిన సుధాకర్​ను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వృద్ధురాలిని సుధాకర్ హత్య చేసినట్లు అంగీకరించాడని...ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు.

ఇదీ చదవండి:

మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.