ETV Bharat / state

తప్పించుకున్న ఒంటరి ఏనుగు.. ఆపరేషన్​ కొంకి వాయిదా

author img

By

Published : Mar 15, 2021, 8:40 PM IST

చిత్తూరు జిల్లాలో పంటపొలాలను నాశనం చేస్తున్న ఒంటరి ఏనుగును పట్టుకోవటం కోసం అటవీ అధికారులు చేపట్టిన ఆపరేషన్​ కొంకిని వాయిదా వేశారు. ఒంటరి ఏనుగు పట్టుకోవటం కోసం శిక్షణ పొందిన ఏనుగులతో చేసిన ప్రయత్నం చివరి దశలో విఫలమైంది. తప్పించుకున్న ఒంటరి ఏనుగు జాడ తెలిసేంత వరకు ఆపరేషన్​ను తాత్కలికంగా వాయిదా వేశారు.

operation konki postponed
తప్పించుకున్న ఒంటరి ఏనుగు... ఆపరేషన్​ కొంకి వాయిదా

చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గంలో పలు మండలాల్లో పంట పొలాలను నాశనం చేస్తూ రైతులను బెంబేలెత్తిస్తున్న ఏనుగుల పట్టివేత కోసం అటవీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ కొంకిని వాయిదా వేశారు. పంట పొలాలను నాశనం చేస్తున్న ఒంటరి ఏనుగును పట్టుకోవటానికి ఏనుగుల శిక్షణ కేంద్రం నుంచి జయంత్, వినాయక ఏనుగులను పుత్తూరు ప్రాంతానికి తరలించారు. శిక్షణ ఏనుగుల సహాయంతో ఒంటరి ఏనుగును అదుపులోకి తీసుకొని రెండు రోజుల పాటు సంరక్షించారు.

ఒంటరి ఏనుగుతోపాటు శిక్షణ ఏనుగులను వెదురుకుప్పం మండలం వైపు తీసుకువస్తుండగా... ఒంటరి ఏనుగు తప్పించుకొని అటవీ ప్రాంతం వైపు వెళ్లింది. ఒంటరి ఏనుగు జాడ కోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో ఏనుగు జాడ తెలిసేంతవరకూ ఆపరేషన్​ను వాయిదా వేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. శిక్షణ పొందిన ఏనుగులతో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన సిబ్బంది వెదురుకుప్పం మండల పరిధిలోని కసవనూరు వద్ద మకాం వేశారు.

ఇదీ చదవండి

ఆపరేషన్​ కొంకీ విజయవంతం.. ఒంటరి ఏనుగు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.