ETV Bharat / state

52 మంది విద్యార్థులు... ఒకే ఉపాధ్యాయురాలు..!

author img

By

Published : Nov 19, 2019, 5:30 PM IST

విద్యార్థులకు పాఠాలు భోదిస్తున్న ఉపాధ్యాయురాలు

చిత్తూరు జిల్లాలోని ఏ.రంగంపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. 5 నెలలుగా 52మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయురాలు పాఠాలు భోదిస్తోంది. స్థానిక ఎంఈవోకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోవటం లేదని ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

52 మంది విద్యార్థులు... ఒకే ఉపాధ్యాయురాలు..!

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట ప్రాథమిక పాఠశాలలో... ఉపాధ్యాయులు కరువయ్యారు. 5 నెలలుగా... ఒకటొ తరగతి నుంచి ఐదో తరగతి వరకు 52 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఒకే ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతోంది. ఎంఈవోకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... స్పందించటంలేదని... స్పందన కార్యక్రమంలోనూ ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్టు గ్రామస్థులు, ఉపాధ్యాయురాలు తెలిపారు. అధికారులు స్పందించి... ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. ఇదిలాఉండగా పాఠశాల భవనం పెచ్చులూడి... పిల్లలపై పడి గాయాలవుతున్నాయి. భవనానికి మరమ్మతు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: పాఠశాలలో పాము... పరుగులు తీసిన విద్యార్థులు

Intro:చంద్రగిరి మండలం లోని ఏ రంగంపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత.......... మాకు కావాలి ఇంకో టీచర్


Body:ap_tpt_36_19_vupadyayuni_korata_av_ap10100

మండల హెడ్ కోటర్స్ కి కూతవేటు దూరంలో ఉన్న ఏ. రంగంపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయురాలు తో ఈ పాఠశాల కాలం వెళ్ళదీస్తున్నది. గత ఐదు నెలలుగా ప్రాథమిక పాఠశాల లోని 52 మంది పిల్లలతో ఒక ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతోంది. పాఠశాల పెచ్చులుడి పిల్లల పైన పడుతుండటంతో గ్రామస్తులు, టీచరు ఎం.ఈ.ఓ గారికి ఎన్నిసార్లు వ్రాతపూర్వకంగా అర్జీలు ఇచ్చిన స్పందన కరువు అవడంతో......... ప్రభుత్వం చేపట్టిన స్పందనలో ఫిర్యాదు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ ఎం.ఈ.ఓ గ్రామస్తులతో డీ.ఈ.వో ఆ పై అధికారులకు ఫిర్యాదు చేయండి అని ఉచిత సలహా ఇచ్చి పంపింది. అనర్ధాలు జరగకముందే జిల్లాస్థాయి అధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనాన్ని రిపేరు చేయించి పిల్లలకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను నియమిస్తారు అని గ్రామస్తులు కోరుతున్నారు.

బైట్స్: దేవా, ఎస్ఎంసి చైర్మన్ ,

పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థులు.


Conclusion: పి.రవి కిషోర్, చంద్రగిరి.9985555813.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.