ETV Bharat / state

పంట పొలాలపై ఏనుగుల దాడులు...

author img

By

Published : Mar 16, 2020, 3:47 PM IST

శేషాచల అడవుల్లో ఏనుగులు గుంపులు అధికమయ్యాయి. సుమారు అరవై ఏనుగులు గుంపులుగా విడిపోయి... నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లోకి ప్రవేశించి పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

elephants attacks near seshachalam forest farming lands at chittor district
శేషాచల అటవీ సమీప పంట పొలాలపై ఏనుగుల దాడులు

శేషాచల అటవీ సమీప పంట పొలాలపై ఏనుగుల దాడులు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లో ఏనుగులు గుంపులు అధికమయ్యాయి. చంద్రగిరి మండలంలోని అటవీ సమీప పంట పొలాలపై కొన్ని రోజులుగా ఏనుగులు దాడులు చేస్తున్నా... అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందిన పంట తమ నోటి దాకా రావడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. వరి, మామిడి పంటలతో పాటుగా రైతులు వేసుకున్న పైపులైన్లు సైతం నాశనం చేస్తున్నాయి. సుమారు అరవై ఏనుగులు.. గుంపులుగా విడిపోయి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగళ్ళు, చంద్రగిరి మండలాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: తితిదే అధికారులు స్పందించారు..రక్షణ గోడ రంగు మార్చారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.