ETV Bharat / state

28న శ్రీకాళహస్తికి సీఎం.. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్​ సమావేశం

author img

By

Published : Dec 21, 2020, 7:53 PM IST

శ్రీకాళహస్తిలో ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్​.. అధికారులతో సమావేశం నిర్వహించారు.

Collector meeting
కలెక్టర్​ సమావేశం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 28న సీఎం పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్​ భరత్​గుప్తా స్థానిక అధికారులతో సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగబోయే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఉరందూరులోని ఇళ్ల స్థలాలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకు వివరించారు.

ఇదీ చదవండి: కొవిడ్​ జాగ్రత్తలు మరచి.. భారీ కృతజ్ఞతా ర్యాలీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.