ETV Bharat / state

ఎన్నికల కోడ్​పై చిత్తూరులో అయోమయం.. ప్రజల్లో సందిగ్ధం

author img

By

Published : Jan 10, 2021, 2:03 PM IST

పంచాయతీ ఎన్నికల ప్రకటన దృష్ట్యా చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్​ అమలులో ఉందా? లేదా? అనే అంశంపై సందేహం నెలకొంది. శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించగా.. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదంటూ జిల్లా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకి ఉండదని అధికారులు అంటున్నారు.

chittoor collector on election code
జిల్లాలో ఎన్నికల కోడ్​ అమలులో ఉందా? లేదా?

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమైంది. శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది. మరోవైపు జిల్లా అధికారులు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. అధికారిక సమాచారం వచ్చాకనే ఈ విషయమై స్పందిస్తామని తెలిపారు. ఫలితంగా జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందా? లేదా? అనేది సందేహంగా మారింది.

మీడియాలో చూశాకే తనకూ ఎన్నికల షెడ్యూల్‌ గురించి తెలిసిందని కలెక్టర్‌ భరత్‌గుప్తా అన్నారు. ఇదే తరుణంలో.. కోడ్‌ అమలులో ఉంటే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. తొమ్మిదో తేదీ రెండో శనివారం కావడంతో అధిక శాతం మండలాల్లో పట్టాలు ఇవ్వలేదు. కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు పట్టాల పంపిణీ చేపట్టాలని భావించినా.. శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది.

ఈ కారణంగా.. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,45,912 మందిని ఇంటి స్థలాలు పొందడానికి అర్హులుగా నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీ నాటికి 1,16,845 మందికి, శనివారం మరో 3750మందికి పట్టాలు ఇచ్చారు. డిసెంబరు 25న దీన్ని ప్రారంభించినందున కొత్త పథకంగా భావించాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. నూతన పథకమైతేనే నిలిపిసే అవకాశం ఉందంటున్నారు.

ఇదీ చదవండి:

ప్రార్థనా స్థలాల్లో మత సామరస్యాన్ని బోధించాలి: జిల్లా కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.